రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తరువాత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పై మంత్రి కొడాలి నాని అగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను రాజీనామా చేసి అమరావతి లో రాజధాని కొనసాగించాలని ఉప ఎన్నికలకి వెళ్లాలని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలలో 20కి 20 సిట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ పై పునరాలోచన చేసే అవకాశం ఉంటుందన్నారు.
ఒక వేళ చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలలో ఓడిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రావాలంటూ ఛాలెంజ్ చేశారు.
అమరావతి లో భూములు ఇచ్చిన రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు నీ శాసన సభ్యులు వెంటనే రాజీనామా చేయ్యండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు కు రాష్ట్ర ప్రజలు చిత్తు,చిత్తుగా ఓడించిన సిగ్గు లేకుండా జూమ్ యాప్ లో పిచ్చివాగుడు వాగుతున్నాడు. రాయలసీమ జిల్లా లో 52 సీట్లు ఉంటే బావ,బామ్మర్ది చంద్రబాబు నాయుడు, బాలయ్యను మాత్రమే గెలిపించారు ప్రజలు.అక్కడ కూడా ప్రజలు చీదరించుకున్న బుద్దిరాలేదు. తెలుగుదేశం పార్టీ కి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రాంతం అక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మిన ప్రజలు చంద్రబాబు నాయుడు కి బుద్దిచెప్పారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా రాజధాని పెట్టిన కృష్ణ, గుంటూరు ప్రజలకు కూడా ఆయన చేసిన మోసం గ్రహించి లోకేష్ ను కూడా ఓడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ అమోదం తెలిపారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలి లేకపోతే మళ్ళీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కన్న కలలను తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వేర్చలని అని అనటం ఆయన మూర్ఖత్వం. ఇప్పుడు ఉన్న రాష్ట్ర అర్దిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఒకే చోట లక్ష కోట్లు పెట్టి మహానగరం కట్టటం సాద్యం కాదు. అమరావతి లో కట్టడానికి అయ్యే ఖర్చు లో 10% విశాఖపట్నం లో పెడితే మనం కూడా మహ నగరలు కు దీటుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని చెప్పుకొచ్చారు మంత్రి కొడాలి.