అవసరమైతే ఎన్డీయే తో కలుస్తామని వైసీపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరో వైపు కేంద్ర క్యాబినెట్ లో వైసీపీ ఎంపీలకు కూడా అవకాశాలు రానుందని వస్తున్న వార్తలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎన్డీయేతో వైసీపీ కలుస్తుందని ప్రెస్ మీట్ లు పెట్టో లేక పిచ్చాపాటిగానో చెప్తే కుదరదని ఈ విషయంపై జగన్ చెప్పే వరకు ఆగాలన్నారు. జగన్ చెప్పిన మాటే వేదమన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని దానికోసమే ముఖ్యమంత్రి జగన్ పాటుపడుతున్నారన్నారు. ప్రస్తుతానికి రాజ్య సభలో వైసీపీ కి రెండు సీట్ లు మాత్రమే ఉన్నాయని, మార్చి, ఏప్రిల్ లో నాలుగు సీట్ లో వస్తాయని, వచ్చే ఏడాది మరో నాలుగు సీట్ లు వస్తాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో రాజ్యసభ లో బిల్లు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతుగా బీజేపీ కి కావాలని, దానినే ఆసరాగా తీసుకుని, కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చి హోదా సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.