కొడాలి నాని, ఏపీ మంత్రి
ఏపీలో అడ్రస్ లేని బీజేపీ విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా వినాయకచవితిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో, ఏపీలోనూ అవే అమలు చేస్తున్నాం. సోము వీర్రాజుకు విగ్రహాలతోనూ, వినాయకచవితితోనూ రాజకీయం చేయడం మామూలేగా.
వినాయకుడిని అడ్డం పెట్టుకుని బీజేపీ, టీడీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్ అన్ని మతాలను గౌరవిస్తారు.
తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ వినాయక చవితిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కరోనాతో ప్రజలకు ఇబ్బందులు వస్తే.. రాజకీయాలు చేయడం కోసం డ్రామాలాడుతున్నారు. వినాయక చవితి విషయంలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లిద్దరూ శవం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు.