హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వే కోసం వెళ్లిన మంత్రి కొప్పుల ఓ అధికారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. తాము వస్తున్నామని తెలిసినా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన చేతిలో ఉన్న ఫోన్ ను విసిరికొట్టారు.
“ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చెప్పిర్రు..? విజిట్ కు వస్తున్నమంటే ఫోనుపట్టుకుని బిజీగా ఉంటవు..ఈ చాపలు ఎవరు వేయించాలె.? ఏర్పాట్లు ఎవరు చేయాలె..? మాకంటే ఎక్కువ బిజీనా నువ్వు.. చూస్తున్నవు కదా ఎంత మందితో మాట్లాడుతున్నామో.. ” అంటూ అధికారిపై మండిపడ్డారు. జమ్మికుంటలోని 21వ వార్డులో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.