చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్.. ఎందుకు?

సెంటిమెంట్ కారణంగానే తెలంగాణ ఇచ్చారన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ప్రత్యేకరాష్ట్రం సెంటిమెంట్‌పై రాలేదని.. ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకున్నామని పేర్కొన్నారు. పోరాటాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలన్నీ చేశారని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వజూపినా తాము పట్టువిడువలేదని అన్నారు. ముమ్మాటికీ పోరాడడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఏపీ హక్కుల గురించి సీఎం మాట్లాడడంలో తప్పులేదని, హక్కుల కోసం పోరాడవచ్చని.. కానీ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు పలుకుతూ ట్వీట్ చేశారు.

ఇటీవల ఏపీకి ప్రత్యేకహోదాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు బదులిస్తూ సెంటిమెంటు కారణంగానే తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన విషయం తెలిసిందే!