పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనకు సంబంధం లేని డ్రగ్స్ ఇష్యూలో తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని కేటీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహరంలో తగిన నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.
తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై వెంటనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. తన ఆరోపణలు వెంటనే ఆపమని ఆరోపించేలా ఆదేశాలివ్వాలని కోరినట్లు తెలిపారు.
Advertisements