• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » కేటీఆర్‌ సీరియస్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్..!

కేటీఆర్‌ సీరియస్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్..!

Last Updated: April 6, 2022 at 2:11 pm

ఎంఐఎం నేతలు గొడవలు, వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. భోలక్‌ పూర్‌ పరిధిలో రాత్రి సమయాల్లోనూ షాపులు, హోటళ్లు తెరిచి ఉంచుతుండడంతో విధుల్లో ఉన్న పోలీసులు వాటిని మూసేయాలని వెళ్లగా.. ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వారితో దురుసుగా ప్రవర్తించాడు.

రంజాన్‌ సమయంలో రాత్రిళ్లు కూడా షాపులు తెరిచే ఉంచుతామని పోలీసులను బెదిరించాడు గౌసుద్దీన్‌. ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని షాపులు మూసివేయాల్సిందేనని ఖాకీలు చెప్పగా.. కార్పొరేటర్‌ రెచ్చిపోయాడు. మీరంతా వంద రూపాయలకు పని చేసే మనుషులు అంటూ నోరు పారేసుకున్నాడు.

గౌసుద్దీన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందిస్తూ.. కార్పొరేటర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలా కుదరకపోతే బీజేపీ నేతలకు అవకాశం ఇస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్‌ బెదిరింపుల వీడియో మంత్రి కేటీఆర్‌ కంటపడింది.

Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty

No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2

— KTR (@KTRTRS) April 6, 2022

Advertisements

ఈ ఘటనపై బాగా సీరియస్‌ అయ్యారు కేటీఆర్‌. పోలీసులపైనే దౌర్జన్యానికి దిగుతారా? వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు గౌసుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

మాట‌లు బారెడు.. ప‌నులు మూరెడు.. ఇదే సారు తీరు!

ఏడాది కష్టపడదాం.. అధికారం సాధిద్దాం: రేవంత్

సైమండ్స్ యాక్సిడెంట్ తర్వాత ఆయన పెంపుడు కుక్క చేసిన పని తెలిస్తే ఏడుపు ఆగదు..!

జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

నా భార్యపై ఆ విషయంలో జెలసీ.. బ్రహ్మాజీ సెన్సేషన్

నాగరాజు హత్య వెనుక కుట్ర.. బాధిత ఫ్యామిలీకి బండి భరోసా

రుతుపవనాలు ఆగయా.. రెండు రోజులు వానలే వానలు

సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న 5 టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసా ??

ముసలోడా అంటూ కామెంట్.. బిగ్ బీ స్ట్రాంగ్ రిప్లై..!

తెలంగాణ నుంచే రాహుల్ పాదయాత్ర.. టీపీసీసీ సమావేశంలో తీర్మానం

మన పోటీ బెంగళూరుతో కాదు

ఉదారత చాటుకున్న భారత్ బయోటెక్

ఫిల్మ్ నగర్

జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

జానీ కాకుండా పవన్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

heroines-marraiges

సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న 5 టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసా ??

ముసలోడా అంటూ కామెంట్.. బిగ్ బీ స్ట్రాంగ్ రిప్లై..!

ముసలోడా అంటూ కామెంట్.. బిగ్ బీ స్ట్రాంగ్ రిప్లై..!

మరోసారి వెండితెరపై జంటగా ప్రభాస్-అనుష్క..!

మరోసారి వెండితెరపై జంటగా ప్రభాస్-అనుష్క..!

చిరు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ నో చెప్పిన సంగతి తెలుసా !!

చిరు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ నో చెప్పిన సంగతి తెలుసా !!

బాలయ్య అట్టర్ ఫ్లాప్ సినిమాలు... నష్టపోని నిర్మాత!!

బాలయ్య అట్టర్ ఫ్లాప్ సినిమాలు… నష్టపోని నిర్మాత!!

ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే...మహేష్ 'సర్కారు వారి పాట ' సినిమా చేశాడా!!

ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే…మహేష్ ‘సర్కారు వారి పాట ‘ సినిమా చేశాడా!!

మరో వివాదంలో కరాటే కల్యాణి.. 24 గంటలైనా దొరకని ఆచూకీ..!

మరో వివాదంలో కరాటే కల్యాణి.. 24 గంటలైనా దొరకని ఆచూకీ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)