నారాయణపేటలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముందుగా ఆయన హోంమంత్రి మహమూద్ ఆలీతో పాటు కేటీఆర్ సింగారం వద్ద ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సీటులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.
పార్టీ కార్యాలయం ముందు గులాబీ జెండాను ఎగురవేశారు.పర్యటనలో భాగంగా మంత్రులు సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.
సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. కొండారెడ్డి పల్లి చెరువు మినీ ట్యాంకు బండ్, సీనియర్ సిటిజన్ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఆ తరువాత జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.