ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకునే మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు.
బీజేపీ నాయకులు మతోన్మాద విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతల ప్రసంగాలతో అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు.
‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ, బీజేపీ మతోన్మాదుల ద్వేషపూరిత ప్రసంగాలకు భారతదేశం ఒక దేశంగా అంతర్జాతీయ సమాజానికి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సిన బీజేపీ.. ఒక దేశంగా భారతదేశం కాదు’. అని అని పేర్కొన్నారు.
రోజు విడిచి రోజు విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, వ్యాప్తి చేస్తున్నందుకు బీజేపీ ముందుగా భారతీయులకు క్షమాపణ చెప్పాలన్నారు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టితో చూస్తూ.. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.