గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తీర్పు విలక్షణంగా ఉంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వని నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే… టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు ఎంఐఎం సహాకారం నేరుగా తీసుకుంటుందా? ఎంఐఎంను గైర్హాజరు అయ్యేలా చేస్తుందా అన్నది కీలకంగా మారింది.
మరోవైపు మేయర్ పదవిని దక్కించుకునేందుకు ఎన్నిక బాధ్యతను మంత్రి కేటీఆర్, తలసాని చూసుకుంటున్నారు. ఇప్పటికే కార్పోరేటర్లతో సమావేశం అయిన ఆయన… కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే ఉద్యమ నేతలకు అవకాశం ఇచ్చామని, గౌరవించామని… ఇప్పుడు పార్టీ నిర్ణయం ఏది తీసుకున్నా, ఎవరి పేరు ఖరారు చేసిన అంగీకరించాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అంటే ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పూర్తి రాజకీయ నిర్ణయంగా మారిపోగా… గతంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ లకు… వారి తరుపు వారికి పదవులు ఇవ్వటం లేదని స్పష్టం అయిపోయింది. మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి కూడా మేయర్ పదవి రేసులో ఉండగా… ఆమెను ఇండైరెక్ట్ గా నో చెప్పినట్లు అయ్యింది.