గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటన చేశారు. పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు గురుకుల పాఠశాలను, బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని, డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల సముదాయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులతో కలిసి ప్రారంభించారు.
భూపాలపల్లి పట్టణంలోని మంజు నగర్ లో రూ.3 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆధితి గృహాన్ని , రూ. 23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని , జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన గణపురం తహసీల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంగాంధీ నగర్ లో రూ. 4 కోట్ల నిధుల తో నిర్మించిన నూతన మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలనుప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థ రూ 229 కోట్ల వ్యయంతో నిర్మించిన 994 డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల సముదాయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి సంస్థ ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీని తిలకించి డబుల్ బెడ్ రూమ్ సముదాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యాలయం రోజు నాయకులు కార్యకర్తలతో కలకలాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం చేయాలని ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం జరిగిందన్నారు.
పేరు మారింది కానీ జెండా, ఎజెండా మారలేదన్నారు . అనంతరం కార్యాలయంలో మొక్కలు మొక్కలు నాటారు .జిల్లా కేంద్రంలోని వేశాలపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, సింగరేణి సీఎండి ఎం శ్రీధర్, డైరెక్టర్లు బలరాం ఎన్ వి కే శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు. పాల్గొన్నారు.