బీజేపీ జనాగ్రహ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారాయన. ‘‘వావ్.. ఏం పథకం.. చీప్ లిక్కర్ ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే బంపరాఫరా?’’అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
బీజేపీ జనాగ్రహ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.75కే ఇస్తామన్నారు. ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు సోము వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.