మోడీ సర్కార్ పై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కనీసం ఒక్క ఫ్లై ఓవర్ ను కూడా పూర్తి చేయలేకపోయిందని ఫైర్ అయ్యారు.

ఇప్పుడు మరో 12 ప్లైఓవర్లు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. కానీ కేంద్రం మాత్రం జాతీయ రహదారుల ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇది కేంద్ర పనితీరుకు నిదర్శమని ఆయన ట్వీట్ చేశారు. దురదృష్టవశాత్తు ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు జాతీయ రహదారుల కింద నిర్మిస్తున్నారని చెప్పారు.
వాటి కోసం జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినప్పటికీ వాటి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.