గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ వేడి పెరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ బీజేపీపై మాటల దాడిని పెంచేసింది. బీజేపీ ఓట్ల కోసం మతం పేరుతో రాజకీయం చేస్తోందని కేటీఆర్ విమర్శల దాడి పెంచారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన ఆంధ్రా ఓటర్లను ఆకర్షించేందుకు అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణకే కాదు ఏపీకి కూడా మోడీ సర్కార్ ఏమీ ఇవ్వలేదని, అమరావతికి కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు. శంకుస్థాపన సమయంలో అమరావతికి ఏం ప్రకటించారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమరావతికి నీళ్లు, మట్టి మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు.
ఓవైపు కేసీఆర్ జగన్ తో స్నేహం చేస్తూ… గ్రేటర్ ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ పాట పాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమరావతికి ఆర్థిక సహాయం కోసం అప్పటి సర్కార్ విశ్వప్రయత్నాలు చేసిందని, కానీ ఏమీ ఇవ్వలేదన్న తమ వాదనను ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బలపర్చిందంటున్నారు.