ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన తర్వాత దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
కాషాయ పార్టీకి దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారడం నవ్వుతెప్పించే విషయమని ఎద్దేవా చేశారు. బీబీసీపై ఐటీ దాడుల తర్వాత హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇది ఏమి ఆశ్చర్యం!! అని ఆయన అన్నారు. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత, బీబీసీ ఇండియాలో ఐటీ శాఖ దాడులు చేస్తోందన్నారు.
ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీకి పెద్ద కీలుబొమ్మలుగా మారడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇక తర్వాత ఏంటి? హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులా లేక శత్రు స్వాధీన ప్రయత్నమా? అంటూ ఆయన సెటైర్లు వేశారు.