రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ సుపరిచితమే. తన సరదా మాటలతో అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. 70 ఏళ్లు దాటినా కూడా తనదైన స్టైల్లో యాక్టింగ్ చేస్తూ అదరగొడుతోంది గంగవ్వ. కరీంనగర్ లో జరిగిన కళోత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేటీఆర్ తో పాటు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మె్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నటుడు శివారెడ్డి, సింగర్లు వొల్లాల వాణి, మధు ప్రియ, స్వర్ణ, వందేమాతరం శ్రీనివాస్ లతో పాటు బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ, సోహెల్, జీల అనిల్, కొమురక్క తదితరులు హాజరై జోష్ నింపారు.
ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. ‘కేటీఆర్ మహేష్ బాబు లెక్క ఉన్నడు’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ సరదాగా స్పందిస్తూ.. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘తాను మహేశ్ బాబులా ఉన్నానని గంగవ్వ అన్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదు కానీ.. ఈ మాట వింటే మహేష్ బాబు ఫీల్ అవుతారని చమత్కరించారు. గంగవ్వా ఎందుకైనా మంచిది ఒకసారి కళ్లు టెస్ట్ చేయించుకో’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నఅందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన గంగవ్వ తన ప్రతిభా పాటవాలతో ఈ వయసులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారని ప్రశంసించారు కేటీఆర్. గంగవ్వకు మాట ఇస్తున్నా.. మై విలేజ్ షోకు వస్తానని చెప్పా.. ఆ షో ద్వారా నాకు తెలిసిన నాలుగు విషయాలు చెబుతా.. నాకు తెలియని నాలుగు విషయాలు కూడా నేర్చుకుంటానని అన్నారు కేటీఆర్.
ఇక కరీంనగర్ కళోత్సవాల ముగింపు వేడుకల్లో మై విలేజ్ షో గంగవ్వను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రామన్న అంటూ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. పాపులర్ అండ్ పక్కా లోకల్ యూట్యూబ్ స్టార్ గంగవ్వ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె మై విలేజ్ షోకి నేను గెస్ట్ గా వస్తానని ప్రామిస్ చేశానని మరోసారి గుర్తు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
Pleasure meeting the popular & Pakka local You Tube star Gangavva Garu 😊
Promised her that I’ll be a guest on her My Village Show asap https://t.co/0Lr5aDQEiI
— KTR (@KTRTRS) October 3, 2022