గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల గెలుపొందిన 54మంది కార్పోరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆయన… భవిష్యత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదని, సిట్టింగ్ లను మార్చిన దగ్గర విజయం సాధించగా… మార్చకుండా పాతవారికే టికెట్ ఇచ్చిన చోట ఓడిపోయామన్నారు. ఈ ఎన్నికలు ఎమోషన్ లో జరిగాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితులు ఉండొచ్చని… అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎమ్మెల్యేలతో పాటు కార్పోరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్లు దక్కటంపై అనుమానాలు వ్యక్తం అవుతుండగా, బీజేపీ దూకుడు మరింత పెరుగుతుందని టీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్లు విశ్లేషణలు కొనసాగుతున్నాయి.