బయో ఆసియా రెండో రోజు సదస్సు సక్సెస్ ఫుల్ గా ముగిసింది. సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా డేటా ఎనలిటిక్స్, అంతర్జాతీయ సప్లే చైన్, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ లాంటి అంశాలపై చర్చలు జరిగాయి. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన అభ్యాసాలు, సవాళ్లు, అవకాశాలపై జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు చర్చించారు.
అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ… ఫార్మారంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న జుబిలెంట్ గ్రూప్ త్వరలో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుండడం చాలా సంతోషకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. జుబిలెంట్ గ్రూప్ లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ క్యాపిటల్‌గా అవతరించిందని పేర్కొన్నారు.
ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడూ అంశాలు దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ఎంతో ప్రభావితం చేస్తాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలను తీసుకురావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు పలు సంస్థలు తెలంగాణ సర్కార్ తో ఒప్పందాలు చేసుకున్నాయి.
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో క్లస్టర్ టు క్లస్టర్ కొలాబరేషన్స్ చేస్తూ లైఫ్ సైన్సెస్ విశ్వ విద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ సంస్థ ఫ్లాండర్స్ ప్రకటించింది. హైదరాబాద్‌లో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అంతర్జాతీయ హెల్త్ కేర్ సంస్థ సొనాఫీ వెల్లడించింది.