టీఎస్ బీపాస్ దేశంలోనే మరెక్కడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పథకం కింద కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలా ఒక వేళ రాకపోతే అనుమతులు ఆటోమేటిక్ గా వచ్చినట్టే పరిగణించాలని ఆయన అన్నారు.
ఈ పథకాన్ని తమిళనాడు వంటి రాష్ట్రాలు మెచ్చు కుంటున్నాయన్నాన్నారు. టీఎస్ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నప్పటికీ వాటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు.
ఇతర శాఖల్లో హౌసింగ్ శాఖను విలీనం చేశామన్నారు. హౌజింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయని, ఇండ్లు ఇచ్చిన తర్వాత అక్కడ సొసైటీలను ఏర్పాటు చేసుకొని దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ రద్దుచేసి రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.
ప్రజల కోరిన మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో ఉందని చెప్పారు. ధరణి తీసుకు వచ్చిన తర్వాత చిన్న భూమిని కూడా మ్యాచ్ చేశామన్నారు. భూములకు ఎలాంటి సమస్యలూ లేవన్నారు.