మోడీ సర్కార్ పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో మరోసారి తీవ్రంగా విరుచుకు పడ్డారు. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కేంద్రంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
‘ అందరికీ మంచి రోజులు వచ్చేశాయి. ప్రజలందరికీ శుభాకాంక్షలు. వంట గ్యాస్ ధరను మరోసారి రూ. 59 పెంచారు. మహిళలకు ప్రధాని మోడీ ధరల పెంపును కానుకగా ఇచ్చారు’ అని ట్వీట్ చేశారు.
సామాన్యుడికి ఇంధన కంపెనీలు బుధవారం మరోసారి షాక్ ఇచ్చాయి. గృహావసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ ధరను మరోసారి పెంచాయి. 14.2 కేజీల సిలిండర్ పై రూ. 50ను పెంచుతున్నట్టు ఇంధన కంపెనీలు ప్రకటించాయి.
తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.1053గా ఉంది. దీంతో పాటు 5 కేజీల సిలిండర్ ధర పై రూ.18 మేరకు పెంచాయి.