జాతీయ కార్యవర్గ సమావేశాలు దగ్గర పడుతుండగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీకి, టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
తెలంగాణ నుంచి ప్రధాని మోడీ పాఠాలు నేర్చుకోవాలని, ‘ఆవో- దేఖో- సీఖో’ ప్రధాని మోడీజీ అంటూ లేఖలో సూచించారు. తెలంగాణలో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, పరిపాలనను అధ్యయనం చేయాలని సూచించారు.
దేశంలో డబుల్ ఇంజిన్తో ప్రజలకు ట్రబుల్ ఎదురవుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని నూతన విధానానికి నాంది పలకాలని సూచించారు.
విద్వేషం, విభజన, అజెండాపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించ వద్దని కోరారు. కేవలం అభివృద్ధి, వికాసం గురించే ప్రధానంగా మాట్లాడాలని కోరారు. పార్టీలోనే విద్వేషం, సంకుచితత్వాన్ని నింపుకున్నారని, అలాంటి పార్టీ నేతలు ప్రజలకు ఉపయోగపడే విషయాలు చర్చిస్తారనుకోవడం అది పూర్తిగా అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు.