టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా కొద్దీ..ఆ పార్టీలో ఫ్రస్ట్రేషన్ అంతకంత పెరిగిపోతోంది. జనం మనసులని గెలుచుకునే మార్గం లేక.. కొందరు నేతలు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తాజాగా రాష్ట్ర ప్రజల పట్ల అత్యంత చులకన వ్యాఖ్యలు చేశారు. జనం తమకు ఓటు వేయడంలేదన్న అక్కసుతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.
జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని.. అందుకే ఏడాది పాటు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రిని కోరతానంటూ లక్ష్మారెడ్డి తిక్క తిక్క వ్యాఖ్యలు చేశారు. 24 గంటలు కాకుండా మూడు, నాలుగు గంటలు మాత్రమే సరఫరా చేస్తే, తమ విలువ తెలుస్తుందని జనంపై తన అసహనం వెళ్లగక్కారు. తాము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడం లేదంటూ పిచ్చి కామెంట్లు చేశారు.
అయ్యా లక్ష్మారెడ్డిగారూ.. మీ ప్రభుత్వం విలువ, పార్టీ విలువ జనానికి తెలియడం కాదు.. ప్రజల విలువ మీకు తెలియడం లేదు. ఏడాది పాటు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆపేయడం కాదు.. కాస్త ఆగండి.. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే జనమే మిమ్మల్ని శాశ్వతంగా సాగనంపుతారు. సంక్షేమ పథకాలకు డబ్బులు టీఆర్ఎస్ నేతల బ్యాంకు అకౌంట్ల నుంచి తీసి ఇవ్వడం లేదు. జనం కడుతున్న ట్యాక్సులను మీకిష్టమైచ్చిన రీతిలో ఖర్చుపెడతూ ..సంక్షేమ పథకాల పేరుతో వారి నోళ్లు మూయిస్తున్నారు. ఒక్కసారి నిజంగానే కరెంటునో, మరో కార్యక్రమాన్నో ఆపి చూడండి.. ఆ జనమే మీ సంగతి తేలుస్తారు.