మంత్రి మల్లారెడ్డి అనగానే అందరూ నవ్వేస్తుంటారు కానీ… ఆయన పైకి కనపడ్డంత సాఫ్ట్ కాదన్నది లోకల్ గా అందరూ చెప్పేదే. కాలేజీలు, వందలాది ఎకరాలు ఆయన సొంతం. పైగా మంత్రి.
తన మేడ్చల్ జిల్లా పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు. ఆ యజమాని స్థానిక సర్పంచ్ తో మాట్లాడి వెంచర్ పనులు స్టార్ట్ చేశాడు. 50ఎకరాల వెంచర్ అంటే… రియల్ భూం మళ్లీ మొదలైందని ఎంకరేజ్ చేసి, అన్ని అనుమతులతో నాణ్యతగా పనులు చేయాలని చెప్పాల్సింది పోయి మంత్రి మల్లారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టాడు.
సర్పంచ్ ను కలిస్తే సరిపోతదా…. మరి మా సంగతేంటీ?, మంత్రి, ఎమ్మెల్యే ఉండరా… నన్ను కలిసే వరకు వెంచర్ పనులు బంద్ పెట్టుర్రి అంటూ ఫోన్ లో బెదిరింపులకు దిగాడు. ఇప్పుడా ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మల్లన్న… గిదేం బుద్ధన్నా అంటూ జనం ఫైర్ అవుతున్నారు.
మంత్రి మల్లన్న బెదిరింపుల వాయిస్ ఇదే-