మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా రావల్ కొల్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి గ్రామానికి వచ్చారు. శంకుస్థాపనలు తప్ప.. ప్రజల గోసలు మీకు పట్టవా అంటూ నిలదీశారు గ్రామస్తులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటిమీద మూటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు.
గడిచిన నాలుగు ఏళ్లలో మంత్రికి పర్యటనలపై ఉన్న శ్రద్ద గ్రామాల అభివృద్ధిపై లేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను ప్రజలకు అందించిన తర్వాతనే గ్రామంలో అడుగుబెట్టాలని నినదిస్తూ.. రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
Advertisements
గతంలో శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేయకుండా పెండింగ్ లో పెట్టి.. కొత్త పనులకు శంకుస్థాపన చేయడానికి రావడం ఏంటని విరుచుకుపడ్డారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసిన తర్వాతనే కొత్తవి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.