ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతిపై తెలుగు రాష్ట్రాల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో ఆయన కన్నుమూయడం బాధాకరమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రజా జీవితంలో గౌతం రెడ్డి హుందాగా ఉన్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాజమోహన్ రెడ్డి, కుటుంబసభ్యులకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు పవన్.
శ్రీ గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/xR6NN8nNGl
— JanaSena Party (@JanaSenaParty) February 21, 2022
గౌతం రెడ్డి మరణవార్త తెలిసి తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడు గౌతం ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను.. నమ్మలేకపోతున్నా అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Deeply saddened & shocked beyond belief to learn about the sudden demise of dear friend @MekapatiGoutham Garu
My heartfelt condolences to the family & friends in this hour of grief
Gone too soon brother. Pray that you rest in peace 🙏 pic.twitter.com/9V7IYk3o03
— KTR (@KTRTRS) February 21, 2022
Advertisements
మంత్రి తలసాని శ్రీనివాస్ గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ.. పిన్న వయసులోనే గౌతం రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. మేకపాటి ఆత్మకు సద్గతులు కలగాలని.. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
గౌతం రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గౌతంరెడ్డి అత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.