ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడేందుకు ఇంటి గడప దాటని వాళ్లు..నేడు యాత్రల పేరుతో తోచిన విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి.హైదరాబాద్ నుంచి జనాన్ని తీసుకువెళ్లి యాత్రలు చేస్తున్న వారు..రాష్ట్ర ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తే బాగుంటుందని విమర్శలు చేశారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత..60ఏళ్ల క్రితం ఏర్పడిన గుజరాత్ అభివృద్ధిని పోల్చి చూస్తే కేసీఆర్ ను విమర్శించే వారికి టీఆర్ఎస్ గొప్పతనం ఏందో అర్థమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.62 ఏళ్ల గుజరాత్ లో ఇంకా కరెంట్ కష్టాలు తీరలేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తునే ఉన్నారని మండిపడ్డారు.ఐటీ,పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణనే ముందుందని మంత్రి స్పష్టం చేశారు.సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్నరాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
Advertisements
బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.సరైన సమయం దొరికినప్పుడు తెలంగాణ వ్యతిరేకులను నేలకేసి కొడతామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం యొక్క ఏడేళ్ల సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.7 శాతంగా ఉందని తెలిపారు.భారతదేశం సగటు ఆర్థిక వృద్ధి రేటు 6 శాతమే ఉందని గుర్తు చేశారు.