జనసేన, బీజేపీ మైత్రిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శించారు. పవన్ నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పూటకో మాట మాట్లాడే వారి మాటలను ప్రజలు విశ్వసించరని, గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జనసేన వచ్చే ఎన్నికల్లో ఎం గెలుస్తుందన్నారు. పవన్ బీజేపీతో జతకట్టడానికి గల కారణాలను చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన పార్టీని ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ లో విక్రయానికి పెట్టారని విమర్శించారు. గతంలో బీజేపీ అగ్రనేతలను విమర్శించిన పవన్ ఇప్పడు ఏవిధంగా పొత్తుకు సిద్ధమయ్యారని మంత్రి నాని ప్రశ్నించారు.