విజయవాడ : జీన్ ప్యాంటు, పెంచిన గడ్డం, చెమట్లు కారే ఫేసు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో మొన్న మంత్రి కొడాలి నాని ఉపరాష్ట్రపతికి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఫోటో ఆమధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో మంత్రి ఆ లిస్టులో చేరారు. ఆయన పేరు కూడా నానీనే. పేర్ని నాని. ఊళ్లో పేర్ని నాని ఎలా వుంటారో బందరులో ఎవర్ని అడిగినా చెప్పేస్తారు. మంత్రి హోదా వచ్చినప్పటికీ నాని ఏం మారలేదు. స్కూటర్ వేసుకుని రోడ్లపై కామన్‌మ్యాన్ మాదిరి తిరిగేస్తుంటారు. అలా తిరుగుతుండగా ఎవరో అభిమాని ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. బంకులో మంత్రి నాని హెల్మెట్ పెట్టుకుని నిలబడి పెట్రోల్ పోయించుకుంటున్న దృశ్యం చూడాలని ఉందా.. ఐతే, చూడండి…