ప్రజారవాణాపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం ఆదేశాలు రాగానే బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేసామని తెలిపారు. సీఎం నుండి ఆదేశాలు వచ్చిన 24 గంటల్లో బస్సులు నడుపుతామని తెలిపారు. ఆర్టీసీ బుకింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని .. సామజిక దూరం పాటిస్తూ సీటింగ్ లో మార్పులు చేశామన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టం అమలు చేస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ తో బుక్కింగ్స్ అనుసంధానం చేస్తామని… బస్సుల్లో యాంటీ వైరల్ స్ప్రే లు అందుబాటులో ఉంటాయన్నారు.