రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలను తాము కూడా సమర్థించమని చిరంజీవి చెప్పినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడరన్నారు. నిర్మాతల మండలితో పేర్ని నాని మచిలీపట్నంలో భేటీ అయ్యారు.
నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలు మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. ఎవరో మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని, సినీ పరిశ్రమ పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉందని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినీ పరిశ్రమను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దన్నారు.
ఇక పవన్ తాజా వ్యాఖ్యలపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు. దేశంలో కిరాయికి ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన అని, తాను రెడ్లకు పాలేరును అయితే పవన్ కమ్మవాళ్లకు పాలేరని మండిపడ్డారు.