గ్రేటర్‌లో పోలింగ్ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు తన కారుపై దాడి చేసిన ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రంగా స్పందించారు. బాచుపల్లిలో తన మెడికల్ కాలేజీకి వెళ్లే క్రమంలో ఫోరం మాల్ దగ్గరకు రాగానే బీజేపీ కార్యకర్తలు తన వాహనంపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తారనడానికి నిన్నటి ఘటన ఒక్కటి చాలని అన్నారు. మంత్రినైనా తను కారులో డబ్బులు పెట్టుకొని తిరగడానికి తానేమైనా వెర్రిపువ్వునా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు తనపై దాడి చేసిన సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా చూపిస్తున్న కారు కూడా తనది కాదని తెలిపారు. తాను కాన్వాయ్‌లో రాలేదని.. రెండు ఫార్చునర్ వాహనాల్లో మాత్రమే వెళ్తున్నట్టు చెప్పారు.