టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడిపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేవలం ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కోట్ల రూపాయల డబ్బులు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నాడని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు డబ్బులకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని ఆమె ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నాడని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీలను సీఎం జగన్ తయారు చేసుకున్నారని చెప్పారు.
గతంలో అమ్ముడుపోయిన 23 మందికి పట్టిన గతే ఇప్పుడు అ నలుగురికి పడుతుందని ఆమె అన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడి పోయినట్టు కాదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు175 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరన్నారు.
సస్పెండ్ అయ్యాక అ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే ఓటు వేశామని డ్రామాలు ఆడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్రామాలు ఆడి ఎవరని మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ నలుగురి స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టి వారిని సీఎం జగన్ గెలిపించుకుంటారని వెల్లడించారు.