సామాన్యులపై అధిక ధరల భారం వేస్తూ.. బాదుడే బాదుడు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా స్పందించారు. గతంలో మీ హయాంలో ఉన్న బాదుడు గురించి మర్చిపోయారా బాబు గారు..? అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శించారు.
మీరు మర్చిపోయినా.. మీ బాదుడు గురించి రాష్ట్ర ప్రజలు మర్చిపోరులే అంటూ విమర్శలు గుప్పించారు. అన్నీ కమనించిన ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని ఎద్దేవ చేశారు రోజా. జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని హితవు పలికారు.
అభివృద్ధిని.. రాష్ట్రంలో ప్రజల ఆధరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా బాదుడు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యంగా ఉందంటూ రోజా వ్యాఖ్యలు చేశారు.
గతంలో వ్యాట్.. ప్రైవేటీకరణ.. విద్యుత్ చార్జీలు ఇలా ప్రతి విషయంలో కూడా సామాన్యులను బాదినది చంద్రబాబు కాదా..? అంటూ ప్రశ్నించారు. విమర్శలు చేసేటప్పుడు అత్మ విమర్శ చేసుకోవాలన్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఒక సారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు రోజా.