సరూర్ నగర్ డివిజన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దిమ్మెతో కాకుండా కరెంటు స్తంభానికి వైర్లతో కట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆమె మండిపడ్డారు. శిలాఫలకం ప్రారంభించకుండానే వెనుతిరిగారు.
మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఓ ఇంటికి వద్ద ఏర్పాటు చేశారు.
మరో దగ్గర రెండు స్తంభాలకు మధ్య శిలాఫలకాన్ని వైర్లతో బిగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి .. ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
మంత్రి వెళ్లగానే జీహెచ్ఎంసీ అధికారులు వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడినుండి తొలగించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.