తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థత గురై ఆసుపత్రి పాలయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మంత్రిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. మంత్రి సబిత ఆరోగ్య పరిస్థితిపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు.