టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు లక్ష్యం లేదని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు దుష్ట శక్తులు యత్నిస్తున్నాయన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడిని ప్రజలే మట్టికరిపిస్తారన్నారు.
ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో దొరికి పోయి ఇక్కడికి వచ్చి కులం కోసం రాజధాని కట్టుకుంటూ ప్రజలను మోసం చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. వయసు మీద పడుతుండటం వల్ల చంద్రబాబు గతంలో ఏం మాట్లాడారో కూడా ఆయనకు గుర్తుండటం లేదు.
అసలు లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ కూడా మేమే ప్రవేశపెట్టామని త్వరలోనే చెప్పుకుంటారని ఆరోపించారు.
చంద్రబాబు హయంలో చేసిన ఒక్క మంచి పని అయినా, పథకం అయినా ఉన్నాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ను పక్కకు తోయడం ఎవరి తరం కాదు. లోకేష్ తో పోలిక తీసుకురావడం అసలు మంచిది కాదన్నారు.