అమరావతి రైతుల పేరుతో జరుగుతున్న పాదయాత్రను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఉత్తరాంధ్రను లక్ష్యం చేసుకున్నారని ఆరోపణలు సంధించారు.
విశాఖ పైన దాడా లేదా ఉత్తరాంధ్ర ప్రజల పై విద్వేషమా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్వరంతో మండిపడ్డారు. మీరు కట్టే భవంతుల వద్ద ఉత్తరాంధ్ర ప్రజలు వాచ్ మెన్ లు లాగా పనిచేయాలేని ప్రశ్నించారు.
అమరావతి ప్రజల రాజధాని కాదు ఒక సామాజికవర్గానికి రాజధానిలాగా నిర్మాణం చేయాలన్నదురుద్దేశ్యం చంద్రబాబులో కనపడుతోందన్నారు.
అమరావతి రైతుల పాదయాత్రను లక్ష్యంగా చేసుకుని టిడిపి అధినేత చంద్రబాబు పై మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శల వర్షం కురిపించారు.