చోర శిఖామణులు ఏకంగా రాష్ట్ర మంత్రి బంగారు కడియాన్నే కొట్టేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ జిల్లాలోని దేవరకద్రలో బంధువుల వివాహానికి హాజరయ్యారు. అంతలోనే కొంత మంది యువకులు గుంపుగా వచ్చి సెల్ఫీ కావాలని అడిగారు. మంత్రి కాదనలేక సరేనన్నారు. అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ సెల్ఫీలిచ్చారు. ఆ తర్వత కొద్ది సేపటికి చూసుకుంటే చేతికి కడియం లేదు. ఎంతో ఇష్టంగా ధరించే కడియం కనిపించకపోవడంతో మంత్రి కాస్త నిరాశకు గురయ్యారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఒక రాష్ట్ర మంత్రి కడియమే చోరీకి గురైందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని విపక్షాలు అంటున్నాయి.