జీవో 203 వివాదాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ .ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కేంద్రాన్ని కోరారు .నరేంద్ర మోదీ జ్యోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు . మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తమ రాష్ట్రాల నీటి వివాదాలను అక్కడి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పరిష్కరించుకున్నాయని ,ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేయడం ఆపాలని అన్నారు .
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు .న్యాయస్థానాల ద్వారా ఏపీ ప్రభుత్వ జీవోను అడ్డుకుంటామన్నారు . కెసిఆర్ కు పాలమూరు జిల్లా అంటే చాలా ప్రేమ అని , అర్ధరాత్రి కూడా కెసిఆర్ పాలమూరు ప్రాజెక్ట్ గురించే ఆలోచిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .పాలమూరు కు దశాబ్దాలుగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు .