అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించి.. ఆపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆ వివాదంపై స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 4 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించినట్టు తాను చెప్పానని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం కేవలం నాలుగు వేల ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నామని తాను చెప్పినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. పనిగట్టుకుని తన వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్లు విజ్ఞతతో మెలగాల్సిన అవసరం ఉందని కోరారు మంత్రి. తన నియోజకవర్గంలో 4 వేల ఇళ్లు కడితే.. 10 వేల అప్లికేషన్లు వచ్చాయన్నారు. లాటరీ పద్ధతిలో అర్హులైన వారికి ఇండ్లను అందజేస్తామని తెలిపారు. అయితే మొన్న ఓ సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీనివాసగౌడ్ అందరికి ఇళ్లు కట్టించాలంటే.. పది నుంచి పదిహేనేళ్లు ఎదురుచూడాల్సిన అవసరముందని.. అందరికీ ఇళ్లు కట్టించడం సాధ్యం కాదని.. స్థోమత ఉన్నవారు వారే నిర్మించుకోవాలని సూచించారు.