నీరా హబ్‌కు వేదామృతం పేరు పెట్టడంపై బ్రహ్మణ, హైందవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నీరా కేఫ్‌కు ఈ పేరు పెట్టడమంటే వేదాలను అవమానించడమేనని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వేదాలను కించ పరిచేలాగా నీరాకు వేదామృతం పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇలాంటి చర్యలు హైందవ జాతిని అవమానించడమే అవుతుందని మండిపడుతున్నాయి. ఆ పేరును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆ పేరును తొలగించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రహ్మణ సంస్థ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారిని బ్రహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు.
దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వేదామృతం పేరుపై వివాదం ఉంటే పరిశీలిస్తామని ఆయన అన్నారు. అన్ని పేర్లను పరిశీలించామన్నారు. ఎలాంటి వివాదమూ లేదనుకున్న తర్వాతే ఆ పేరును నిర్ణయించామన్నారు. కల్లు వేరు నీరా వేరని ఆయన చెప్పారు.
వేదాలను అధ్యయనం చేశాకే నీరా కేఫ్‌కు ఆ పేరు పెట్టామన్నారు. తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాల్లో పేర్కొన్నారని వెల్లడించారు. వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వేదాల్లో సురాపానం గురించి ఉందని ఆయన వివరించారు.