టీడీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అసంతృప్తిగా ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస రావుతో టీడీపీ నేత నారా లోకేష్ ఈ రోజు భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరద్దరూ పలు అంశాలపై చర్చించారు.
గంటా శ్రీనివాస రావు ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చారు. జూబ్లీహిల్స్‌లో లోకేష్ నివాసంలో ఇద్దరు భేటీ అయ్యారు. పార్టీకి తాను ఇంత కాలం ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో ఈ సందర్భంగా లోకేష్ కు ఆయన వివరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గంటా విషయంలో హైకమాండ్ వైఖరి ఎలా ఉండబోతోందో చూడాలి.
అయితే ఈ రోజు జరిగిన భేటీలో కొంత వరకు స్పష్టత వచ్చినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచి టీడీపీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది ఇలా వుంటే 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో గంటా క్రియాశీలకంగా లేరు.
కానీ టీడీపీ నేతలను దీన్ని ఖండిస్తున్నారు. ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. ఇక ఆయనపై అటు హై కమాండ్ కూడా ఇన్ని రోజులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా లోకేష్ భేటీతో అసంతృప్తులు చల్లారి ఆయన మరోసారి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.