మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వం చాటుకున్నాడు. కరోనా వ్యాధి ప్రబలి జన సందోహం లేని సమయంలో ఓ వృద్దురాలు రోడ్డు పక్కన అనాథ మరణం పొందింది. ఎవరూ కూడ సహయం చేయడానికి ముందుకు రాకపోవడంతో… మీడియా మిత్రులు మంత్రి దృష్టికి తీసుకపోగా హుటాహుటిన వైద్యులతో మంత్రి అక్కడకు చేరుకొని, మూడువేల రూపాయాలు ఆర్దిక సహయం అందించి… మృతదేహాని స్వయంగా మంత్రి స్టెచ్చర్ సహయంతో అంబులెన్స్ వరకు మోశారు. దీంతో మనస్సున్న మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ను కీర్తిస్తున్నారు.
కరోనా వైరస్ తో ఎదుటువారికి సహయ నిరాకరణ చేస్తుండటంతో… మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అరవై సంవత్సరాల పైబడి వున్న వృద్దురాలు కొంతకాలంగా తెలంగాణ చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపుల ఎండకు ఎండుతూ… వానకు తడుస్తు జీవనం గడిపేది. బాగోగులు చూసుకోవడానికి కొడుకు రాజు నిత్యం చుట్టుపక్కల వుండే దుఖాణాలలో పనిచేసి వచ్చే చిల్లర డబ్బులతో తన తల్లి యాదమ్మను బతికించేవాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మరణించింది. కరోనా వ్యాధి సీజన్ వుండటంతో ఎవరూ కూడ సహయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో… మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మీడియా మిత్రులు సమాచారం ఇవ్వడంతో మంత్రి చేరుకొని దహన సంస్కారాల కోసం మూడువేల రూపాయాలను అందించారు. వృద్దురాలి మృతదేహని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా అంబలెన్స్ లోకి ఎక్కించారు. దహనసంస్కారాల బాధ్యతలను మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. దీంతో మనస్సున్న మంత్రి గా జనాలు చర్చించుకుంటున్నారు.