మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులు, కళాకారులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనని పిలవకపోవడాన్ని తప్పుబట్టారు. కొంత మంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్ల స్థలాలు ఇచ్చి, మొగులయ్యకు మాత్రం నగర శివారు ప్రాంతమైన బీఎన్ రెడ్డి కాలనీలో జాగా ఇవ్వడం పై ఆయన సీరయస్ అయ్యారు.
మొగులయ్యను ఢిల్లీకి తీసుకెళ్లి అతని కళను అందరికీ పరిచయం చేసింది తానేనని గువ్వల బాలరాజు గుర్తు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అయితే వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అవుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడ్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.
క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. బాక్సర్ నిక్కత్ జరీన్ కు, షూటర్ ఈషా సింగ్ కు డీఎస్పీ ఉద్యోగం, బంజారాహిల్స్ లో 600 గజాల స్థలం ఇస్తున్నామని ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు కూడా హైదరాబాద్ లో 600 గజాల భూమి, డబ్బులు ఇచ్చామని చెప్పారు. ఇక ప్రభుత్వం స్థలం కేటాయించడం పై మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు.