ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా పారా మోటర్ ఒక్కసారి ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. దీంతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే ఉన్న మంత్రులు విడదల రజనీ,గుడివాడ అమర్నాథ్ లు షాక్ కు గురయ్యారు.
అయితే విశాఖ ఆర్కే బీచ్ లో G20 సదస్సులో భాగంగా మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో ఈ రోజు ఉదయాన్నే మారథాన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మారథాన్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ లు స్టార్ట్ చేశారు.
అయితే నిర్వాహకుల ఆహ్వానం మేరకు మినిస్టర్ సురేష్ పారా మోటరింగ్ రైడ్ కు బయలు దేరారు. మంత్రి విడదల రజనీ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు మంత్రి సురేష్ ఉత్సాహం చూపించారు.
అయితే విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో పారా మోటర్ కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు.