పదే పదే సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామంటున్నారు… ఆ ధైర్యం మీకుందా అంటూ మంత్రి తలసాని బీజేపీ నేతలను సవాల్ చేశారు. కేవలం రెండు ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నేతలు విర్రవీగుతున్నారని, టీఆర్ఎస్ అనేక ఎన్నికల్లో గెలిచి వచ్చిందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ… కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని తలసాని విమర్శలకు దిగారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించకుంటే ప్రజలే మీ పై తిరగబడతారని హెచ్చరించారు.