ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణలో ఎవరూ భయపడరని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడిన మంత్రి.. బీజేపీపై దుమ్మెత్తి పోశారు.
బీజేపీకి వాడుకునేందుకు పాకిస్తాన్,మతం ప్రచారాలు చక్కగా దొరికాయని మండిపడ్డారు.ఈ రెండింటి పేరు చెప్పి బీజేపీ ప్రజలను రెచ్చట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి. పారిశ్రామికవేత్తల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం బతుకుతోందని ఆరోపించారు.
కేంద్రానికి రాష్ట్రం ఏమిచ్చిందో తాము చెప్తామని అన్నారు. మరి రాష్ట్రానికి ఏమిచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. ఈ విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు తలసాని.