కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తో కొంత మంది సినిమా పెద్దలు సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం మీడియా మంత్రి తలసాని మాట్లాడారు. అందరి అభిప్రాయలు తీసుకొని ముందుకెళ్తున్నాం… షూటింగ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు తలసాని. ఒకటిరెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు తెలుపుతామని తెలిపారు.
ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్.శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు.