సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… సిరివెన్నెల మరణం యావత్ తెలుగు ప్రజలకు బాధాకరమైన రోజని అన్నారు. 3 వేల పాటలు రాసిన మహనీయుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు పండగలా ఉంటాయన్నారు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు, 11 సార్లు నంది అవార్డు రావడం గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు తలసాని. సిరివెన్నెల పాటలు అందరికీ అర్ధం అయ్యేలా ఉంటాయి. అతి తక్కువ వయసులో ఆయన మన నుంచి దూరం కావడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు మంత్రి తలసాని. సిరివెన్నెల మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని పాటల రచయితలు సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పారు తలసాని.