సినీ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని..ప్రజలు ధైర్యంగా థియేటర్ కు వెళ్లి సినిమా చూడొచ్చని అన్నారు తలసాని.అలాగే థియేటర్ల మూత,ఆక్యుపెన్సీపై ప్రచారాన్నికూడా ఎవరూ నమ్మవద్దని అన్నారు. కాగా ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ అంటూ కొన్నివార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు మాస్క్ తప్పని సరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » థియేటర్లు మూసేది లేదు – సినీ ప్రముఖులతో తలసాని భేటీ